ఆ సమయంలో.. ప్రతి 30 గంటలకు ఒక కోటీశ్వరుడు పుట్టాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : కరోనా సంక్షోభం, ధరల పెరుగుదలతో ప్రపంచంలో ఆర్థిక అంతరాలు మరింత పెరిగాయని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ పేర్కొంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో ‘ప్రాఫిటింగ్ ఫ్రమ్ పెయిన్’ పేరుతో ఆక్స్‌ఫామ్ రిపోర్టును విడుదల చేసింది. కొవిడ్ కష్ట కాలంలో ప్రతి 30 గంటలకు కొత్త బిలియనీర్ పుట్టుకొచ్చినట్లు నివేదిక వెల్లడించింది. అయితే, ఈ ఏడాది ప్రతి 33 గంటలకు దాదాపు 10 లక్షల మంది కడు పేదరికంలోకి జారుకోవచ్చని హెచ్చరించింది. అంతేకాదు, గడిచిన కొన్ని దశాబ్దాల్లో ఎన్న డూ లేనంత వేగంగా నిత్యావసరాల ధరలు పెరగగా.. ఆహారం, ఇంధన రంగాలకు చెందిన పారిశ్రామిక బిలియనీర్ల సంపద ప్రతి రెండు రోజులకో బిలియన్ డాలర్ల చొప్పున పెరిగిందని రిపోర్టు తెలిపింది.