నిర్ణీత సమయంలోనే.. రేషన్
1 min read– తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి
పల్లెవెలుగు వెబ్, రాయచోటి : కరోనా విపత్కర పరిస్థితులలో ఎటువంటి సమస్యలు లేకుండా లబ్దిదారులకు సకాలంలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలని రాయచోటి తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలో ఎన్జీవో హోమ్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ నెలలో పంపిణీ చేసే రేషన్ సరుకులు ఎటువంటి జాప్యం జరగకుండా సకాలంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా చూడాలన్నారు. వీఆర్వో, నోడల్ ఆఫీసర్స్,యండి యూ ఆపరేటర్ ఈ నెలలో జరిగిన రేషన్ పంపిణీ కార్యక్రమంలో కొన్ని చోట్ల సమస్యల కారణంగా ప్రజలకు సకాలంలో బియ్యం అందలేదన్నారు. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కేటాయించిన విదంగా లబ్ది దారులకు రేషన్ సరుకులు పంపిణీ చేయాలన్నారు.ఏదైనా సమస్యలున్నా తమ దృష్టికి తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ నరసింహ కుమార్,ఆర్ ఐ అజహర్ అలీ లు పాల్గొన్నారు.