డ్యాం వద్ద.. ఏపీ అధికారులను అడ్డగించిన పోలీసులు
1 min readపల్లెవెలుగు వెబ్: నాగార్జున సాగర్ డ్యాం వద్ద ఏపీ అధికారులను పోలీసులు అడ్డకున్నారు. నాగార్జున సాగర్ లో తెలంగాణ జెన్ కో విద్యుత్ ఉత్పత్తి ఆపాలని వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన అధికారులను పోలీసులు అడ్డుకుని.. వెనక్కి పంపారు. నీటి వివాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పలు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద పోలీసులను భారీగా మోహరించింది. వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేసింది. ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య నీటి వివాదం విషయంలో వాడీవేడీగా విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి.