ఆస్కార్ బరిలో.. ఇండియన్ డాక్యుమెంటరీ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఇండియన్ డాక్యుమెంటరీ ఆస్కార్ బరిలో నిలిచింది. రైటింగ్ విత్ ఫైర్ డాక్యుమెంటరీ ఆస్కార్ బరిలో నిలిచింది. తదుపరి రౌండ్ లో కూడ నిలిస్తే ఆస్కార్ కు నామినేట్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరి 30న విడుదలైన డాక్యుమెంటరీని ఢిల్లీకి చెందిన రింటూ థామస్, సుస్మిత ఘోష్ దర్శకత్వం వహించారు. మొత్తం 138 డాక్యుమెంటరీలు ఈ విభాగంలో పోటీపడగా.. టాప్ 15 డాక్యుమెంటరీలను షార్ట్ లిస్ట్ చేశారు. ఒక దళిత మహిళ నడిపిస్తున్న వార్త పత్రికకు చెందిన మహిళా రిపోర్టర్లు.. పురుషాధిక్యత, కుల వివక్ష ఉన్న సమాజంలో ఏ విధంగా తమ వృత్తిని కొనసాగించారు.. కేవలం పత్రికకే పరిమితం కాకుండా డిజిటల్‌గానూ రాణించేందుకు ఎంత కష్టపడ్డారో తెలియజేసే విధంగా ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.