క్రీడాకారులు ఏకాగ్రతతో సాధన చేస్తే పతకాలు సాధించవచ్చు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: క్రీడాకారులు ఏకాగ్రతతో విల్లు విద్యలో సాధన చేస్తే పతకాలు సాధించవచ్చుని డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. మంగళవారం కర్నూల్ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆవరణలో ఆర్చరీ పోటీలను జిల్లా క్రీడా శాఖ సీఈఓ పివి రమణతో కలిసి ప్రారంభించారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణతో తమకు నచ్చిన క్రీడాంక్షన్లో పాల్గొని సాధన చేస్తే మంచి ఫలితాలను సాధించవచ్చు అన్నారు.అనంతరం సీఈఓ రమణ మాట్లాడుతూ క్రీడాకారులు అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని పతకాలు సాధించి వాటి ద్వారా వచ్చే ప్రశంసా పత్రాలతో ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా విల్లు విద్య సంఘం కార్యదర్శి నాగరత్నమయ్య,కోచ్ వంశీ కృష్ణ, క్రీడాకారులు భరత్,బాలాజీ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.
