ఆత్మకూరు ఘటన.. తాడోపేడో తేల్చుకుంటాం !
1 min readపల్లెవెలుగువెబ్ : కర్నూలు జిల్లా ఆత్మకూరులో జరిగిన ఘటనలో ఏపీ ప్రభుత్వమే ముద్దాయి అని బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. ఆత్మకూరు ఘటనలో పోలీసుల పై కూడ దాడి జరిగిందన్నారు. బీజేపీ నేత శ్రీకాంత్ రెడ్డిని చంపేస్తామంటూ బెదిరించిన ఆడియో తమ వద్ద ఉందని వీర్రాజు తెలిపారు. తప్పుడు కేసు పెట్టి ఆయనను జైలుకు పంపిస్తారా ? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలపై కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తప్పుడు కేసులు పెట్టి అన్యాయంగా జైలుకు పంపిస్తున్నారని, వైకాపా తీరు మార్చుకోకపోతే తాడోపేడో తేల్చుకుంటామని అన్నారు.