కశ్మీర్ పండిట్ల పై దురాగతాలు.. బీజేపీ మద్దతు ప్రభుత్వంలోనే .. !
1 min readపల్లెవెలుగువెబ్ : కాశ్మీర్లో పండిట్ల బహిష్కరణ జరిగింది వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలోనేనని, ఆయన ప్రభుత్వం మనగూడింది బీజేపీ మద్దతుతోనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్ అళగిరి పేర్కొన్నారు. అయితే చరిత్రను వక్రీకరించి,ఆ పాపాన్ని ఇతర ప్రభుత్వాలపై నెట్టడం కాషాయ పార్టీ నేతల దుర్మార్గపు చర్య అని పేర్కొన్నారు . ఆ ఘటనలు జరిగింది నెహ్రూ,ఇందిరాగాంధీ,రాజీవ్‌గాంధీ హయాంలలో కాదని.. వీపీ సింగ్ ప్రభుత్వ కాలంలోనేని వివరించారు. ‘కాశ్మీర్ ఫైల్స్’ చిత్రం ప్రదర్శన థియేటర్లలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు రకరకాలుగా ప్రతిజ్ఞబూనుతున్నారని ఎద్దేవా చేశారు. పండిట్ల బహిష్కరణ ఘటనలు బీజేపీ మద్దతుతో సాగిన వీపీ సింగ్ ప్రభుత్వ హయాంలో జరిగినప్పుడు తప్పు ఎవరిదో ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.