PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేఎస్​ఆర్​ హాస్పిటల్​లో దారుణం..

1 min read
కేఎస్​ఆర్​ ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న కలెక్టర్​, ఎస్పీ

కేఎస్​ఆర్​ ఆస్పత్రిని తనిఖీ చేస్తున్న కలెక్టర్​, ఎస్పీ

– అనుమతి లేకపోయినా.. కోవిడ్​ ట్రీట్​మెంట్స్​
– ఆక్సిజన్​ అందక ఇద్దరు మృతి ?
– ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్​, ఎస్పీ
– ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: కర్నూలు నగరంలో ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్ కు ట్రీట్మెంట్ ఇచ్చిన కె.ఎస్.కేర్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప లు శనివారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేఎస్​ఆర్​ ఆస్పత్రిలో ఆక్సిజన్​ అందక ఇద్దరు కోవిడ్​ పేషెంట్స్​ మృతి చెందారన్న మాట వాస్తవం కాదని, డిఎంహెచ్ఓ, డాక్టర్లు, డ్రగ్ కంట్రోల్ ఎడి బృందం ఎంక్వయిరీ టీమ్ ప్రాథమిక విచారణ చేసి వచ్చిన నివేదిక ద్వారా వెల్లడిస్తున్నానని కలెక్టర్​ పేర్కొన్నారు. అయినా ముందు జాగ్రత్తగా కె.ఎస్.కేర్ ఆసుపత్రిలో ఉన్న పేషేంట్స్ ను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి జిజిహెచ్ కు అంబులెన్స్ లలో తరలించామన్నారు.
ఆక్సిజన్​ కొరత లేదు…: కర్నూలు డ్రగ్ కంట్రోల్ ఏ.డి.ఇచ్చిన నివేదిక ప్రకారం కర్నూలు ఆర్.ఎస్.గ్యాస్ సంస్థ ద్వారా కె.ఎస్.కేర్ ప్రవేట్ ఆసుపత్రికి 30.4.2021 నుండి 1-5-2021 వరకు 122 మెడికల్ ఆక్సీజన్ సిలిండర్స్ ను సరఫరా చేశారు…శనివారం ఉదయం 5 .. మద్యాహ్నం 9 మెడికల్ ఆక్సీజన్ సిలెండర్స్ ను కర్నూలు ఆర్.ఎస్.గ్యాస్ సంస్థ ద్వారా కె.ఎస్.కేర్ ప్రవేట్ ఆసుపత్రి వారు తీసుకున్నారు.. కాబట్టి ఆక్సీజన్ కొరత లేదని డి.ఎం.హెచ్.ఓ డాక్టర్స్ బృందం, డ్రగ్ కంట్రోల్ ఏ.డి.తెలిపారు…చికిత్స వివరాలపై నిపుణుల డాక్టర్ల బృందంతో పూర్తి స్థాయి విచారణ చేయిస్తాము.


కేఎస్​ఆర్​ ఆస్పత్రిపై క్రిమినల్​ కేసు నమోదు : ప్రభుత్వ అనుమతి లేకుండా కోవిడ్ పేషేంట్స్ ను అనధికారికంగా అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ ఇచ్చిన కె.ఎస్.కేర్ ఆసుపత్రి యజమాన్యంపై చట్ట ప్రకారం క్రిమినల్ కేసు బుక్ చేశాం.. తదుపరి చర్యలు చేపడతాం.. ఇటీవల గాయత్రి ఆస్పత్రి ఎండీని అరెస్టు చేశామని స్పష్టం చేశారు. జిల్లాలో ప్రభుత్వం నోటిఫై చేసిన 28 కోవిడ్ ఆసుపత్రుల్లో ఎటువంటి బెడ్స్ గాని, ఆక్సీజన్ కొరత గానీ లేదు అని కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప సంయుక్త హెచ్చరిక జారీ చేశారు. జేసీ రామసుందర్ రెడ్డి, కర్నూలు మునిసిపల్ కమీషనర్ డీకే బాలాజీ, డి.ఎం.హెచ్.ఓ డా.రామగిడ్డయ్య, తదితరులు పాల్గొన్నారు.

About Author