తిరుపతి ‘రుయా’ లో దారుణం.. 11 మంది మృతి
1 min readపల్లెవెలుగు వెబ్: తిరుపతి రుయా ఆస్పత్రిలో దారుణం జరిగింది. ఆక్సిజన్ అందక 11 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం జరిగిందని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. పరిస్థితి తీవ్రతను అంచన వేయడంలో విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన వారి బంధువుల రోదన, ఆందోళనతో తిరుపతి రుయా ఆస్పత్రి అట్టుడికిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బాధితుల బంధువులు ఆస్పత్రిలో విధ్వంసానికి దిగారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కోవిడ్ బారినపడ్డ వ్యక్తుల బంధువులను ఆస్పత్రిలోకి అనుమతించడంలేదు. కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
ప్రజల్ని భయపెట్టొద్దు: రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా ప్రెజర్ తగ్గి 11 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ప్రజలన్ని భయాందోళనకు గురిచేయొద్దని తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు కోరారు. విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.