దాడి చేసి రివర్స్ కేసులు పెడతారా ?
1 min readపల్లెవెలుగు వెబ్: దేవినేని ఉమపై కేసులు పెట్టడం దుర్మార్గమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. వైకాపా నాయకులే దాడి చేసి రివర్స్ కేసులు పెట్టారని ఆరోపించారు. విజయవాడలోని గొల్లపూడిలో దేవినేని ఉమ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేవినేని ఉమ ఎస్సీలపై దాడి చేసినట్టు అక్రమ కేసులు పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. కొండపల్లి బొమ్మలను తయారు చేసే చెట్లను మైనింగ్ పేరుతో నరుకుతున్నారని అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతుందన్నా పట్టించుకోలేదని చెప్పారు. దాడి చేసి రివర్స్ కేసు పెట్టడం నీచమైన చర్య అని, అక్రమ మైనింగ్ పై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం పట్టించకోనందునే దేవినేని ఉమ అక్రమ మైనింగ్ పరిశీలనకు వెళ్లారని తెలిపారు. ఈ దాడులకు టీడీపీ భయపడదని చంద్రబాబు చెప్పారు.