కుక్కల దాడి.. గొర్రె పిల్లల మృతి
1 min read-ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్
పల్లెవెలుగు వెబ్: చెన్నూరు ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న పొలాలలో సోమవారం సాయంత్రం మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పంగ ఈశ్వరయ్య, ఎల్లయ్య, ఆదినారాయణ లకు చెందిన 50 గొర్రె పిల్ల లు కుక్కల దాడిలో మరణించాయి , ఎల్లమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న పొలాలలో పంగా ఈశ్వరయ్య, ఎల్లయ్య ,ఆదినారాయణ లు కంచ ఏర్పాటు చేసి అక్కడ గొర్రె పిల్లలను వదలి పక్క పొలాలలో గొర్రెలను మేపుకుంటూ ఉండగా, సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుక్కలు గొర్రె పిల్లల మంద పై దాడి చేయడంతో 50 గొర్రె పిల్లలు మృతి చెందడం జరిగింది, అలాగే మరికొన్ని గొర్రె పిల్లలు గాయపడడంతో వాటికి గ్రామ సచివాలయ వెటర్నరీ డాక్టర్లు, హరిత, కళ్యాణ్ లు, చికిత్స చేశారు , కాగా ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ , అక్కడి వెళ్లి గొర్రె పిల్లలను పరిశీలించారు, కాగా కుక్కల దాడిలో గొర్రె పిల్లలు ఛిద్రంగా పడి ఉండడం చూసి వెంటనే, జెడి శారదమ్మకు, వెటర్నరీ డాక్టర్ ఉపేంద్ర లకు ఫోన్లో సమాచారం అందించారు, గొర్రెల పైనే జీవనం సాగిస్తున్న వీరికి అధికారులు సహాయం చేయాలని ఆయన వారికి తెలియజేశారు, అయితే అధికారులు ఎన్ని గొర్రెలు, ఎన్ని గొర్రె పిల్లలు మృతి చెందాయో పరిశీలించి, వారికి తగిన సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది, కాగా కుక్కల దాడిలో 50 కి పైగా గొర్రె పిల్లలు చనిపోవడం, మరికొన్ని గాయపడటంతో తీవ్ర ఆవేదన పడ్డారు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, వారు కోరారు.