PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అద్దంకి ద‌యాక‌ర్ పై దాడి

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ పై మాజీ ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి వర్గీయులు దాడి చేశారు. కొంతకాలంగా దామోదర్‌రెడ్డి, దయాకర్‌ వర్గాల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. ఇటీవల కాలంలో దామోదర్‌రెడ్డితో పాటు మరికొందరిపై ఏఐసీసీకి అద్దంకి దయాకర్ ఫిర్యాదు చేశారు. దీంతో అద్దంకి దయాకర్‌‎పై దామోదర్‌రెడ్డి వర్గీయులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. సోషల్‌ మీడియా ఇన్‌చార్జ్‌ కొండరాజు వివాహానికి హాజరైన అద్దంకి దయాకర్‌పై దాడి చేశారు. ఈ ఘటనతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

                              

About Author