కాంగ్రెస్ నేత ఇంటి పై దాడి
1 min readపల్లెవెలుగు వెబ్ : కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షిద్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఉత్తరఖండ్ లోని నైనిటాల్ లో ఆయన ఇంటి పై దాడి చేశారు. దాడిలో ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఇంటి డోర్లకు నిప్పుపెట్టారు. ఇటీవల అయోధ్య పై ఆయన రచించిన పుస్తకంలో హిందూత్వకు, తీవ్రవాద సంస్థలకు పోలిక ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రాజుకుంది. తన ఇంటి పై జరిగిన దాడికి సంబంధించి ఫోటోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. తన ఇంటి పై దాడి చేసిన వ్యక్తుల చేతుల్లో బీజేపీ జెండాలు ఉన్నాయని సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. ఈ దాడిలో పాల్గొన్న 21 మంది అనుమానితుల్ని అరెస్టు చేసినట్టు నైనిటాల్ ఎస్పీ జగదీష్ చంద్ర తెలిపారు. దాడిలో సల్మాన్ ఖుర్షీద్ కుటుంబ సభ్యులెవరికీ హాని జరగలేదని తెలిపారు.