విలేకరుల పై దాడి ప్రజాస్వామ్యానికి గొడ్డలి పోటు.. ఏ పీ డబ్ల్యూ జె ఎఫ్..
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల ఓర్వకల్: అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో ఆదివారం నాడు వైసిపి పార్టీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై ఈనాడు విలేఖరి సంపత్ పై వైసీపీ శ్రేణులు దాడి చేయడం అమానుషమని సోమవారం నాడు ఓర్వకల్ తాసిల్దార్ కార్యాలయం వద్ద ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు ప్రజాసంఘాలు నాయకులు ఆందోళన నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రశ్నించే వారికి రక్షణ లేకుండా పోయిందని వైసిపి గుండాలు రెచ్చిపోవడం ఫోర్త్ ఎస్టేట్ లో భాగమైన పాత్రికేయులపై దాడులు చేయడం పిరికిపంద చర్య అని వెంటనే నిందితులపై కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు..పాత్రికేయులు మాట్లాడుతూ నాయకులకు ప్రజలకు అధికారులకు వారధిగా పనిచేసే తమపై రాష్ట్రంలో ఏదో ఒక మూలలో నిత్యం దాడులకు గురవడం ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం చూసి చూడనట్టు వదిలేయడం ఎంతవరకు సమంజసమని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న గుండాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం తాసిల్దార్ శ్రీనివాసులకు వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాసంఘాల నాయకులు జర్నలిస్టులు టిడిపి నాయకులు ప్రజలు పాల్గొన్నారు గడివేముల మండల కేంద్రంలో పాత్రికేయులు టిడిపి నాయకులు ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాత్రికేయులు మాట్లాడుతూ దాడి చేసిన వారిపై ప్రభుత్వం పోలీసులు చర్యలు తీసుకోవాలని వార్తా సేకరణ కోసం వెళ్లిన పాత్రికేయులపై దాడులు ఈ మధ్యకాలంలో పెరిగిపోయాయని యాజమాన్యాలపై ఉన్న కోపాన్ని సంస్థలు పని చేసే తమపై చూపడం ఎంతవరకు సమంజసం అని రాజకీయ రంగు పొలిమే జర్నలిస్టులను విభజించి నాయకులు తమపై ఆక్రోషం వెళ్లగక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.