PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టులపై దాడి.. ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం: ఏపీడబ్ల్యూజెఎఫ్ 

1 min read

పల్లెవెలుగు, కల్లూరు అర్బన్: జర్నలిస్ట్ ఎప్పుడు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలపై దృష్టి పెడతాడు.ఇది ఒక విలేకరిగా వారి బాధ్యత. సామాజంలో జరిగే అవినీతి,అక్రమాలపై రాస్తున్న కథనాలు జీర్ణించుకోలేని పాలకులు భౌతిక దాడికి దిగడం ముమ్మాటికి అది సమాజం పై దాడే.ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడుతున్న జర్నలిస్ట్ లపై దాడులు,భద్రత వ్యవస్థ పనితీరుకు అద్దం పడుతున్నాయి.ఈ నేపథ్యంలో ఆలూరు సూర్య విలేకరి చంద్ర, ప్రజాశక్తి విలేఖరి కృష్ణలపై మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు దాడికి తెగబడడం దుర్మారం అని, తక్షణమే మంత్రి గుమ్మనూరును బర్త్ రఫ్ చేయాలనీ,దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజెఎఫ్ పాణ్యం నియోజకవర్గం కార్యదర్శి నీలం సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ మేరకు మంగళవారం కల్లూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏపీడబ్ల్యూజెఎఫ్ కల్లూరు కమిటీ ఆధ్వర్యంలో ఆలూరులో జర్నలిస్ట్స్ పై జరిగిన దాడిని వ్యతిరికిస్తూ మండల ఉపాధ్యక్షులు నాగేంద్ర అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేపట్టారు.కార్యక్రమానికి పాణ్యం నియోజకవర్గం వర్గం కార్యదర్శి నీలం సత్యనారాయణ, సహాయ కార్యదర్శి వి.విజయ్ కుమార్,హాజరై మాట్లాడారు.వాస్తవాలను వార్తలుగా రాస్తే పాలక వర్గాలు దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు.  వైసీపీ మంత్రి ఇలాఖలో జరుగుతున్న అక్రమాలను సూర్య పత్రిక విలేఖరి చెన్నంపల్లి చంద్రమోహన్ ప్రజలు,ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు వార్త ప్రచురణ చేయడం జరిగిందని అన్నారు.దీంతో జీర్ణించుకోలేని మంత్రి గుమ్మనూరు జయరాం అనుచరులు కొందరు కక్ష పెంచుకుని దాడిశారన్నారు. ఈ సందర్బంగా చంద్ర మోహన్ పక్కనే ఉన్న ప్రజాశక్తి విలేఖరి మర్కటం కృష్ణ అడ్డుకునేందుకు ప్రయత్నం చేసిన మానవత్వం మరిచి ఇరువురిపై దాడికి పాల్పడడం దుర్మార్గం న్నారు.కల్లూరు కార్యదర్శి పరమేష్ మాట్లాడుతూ సమాజంలో అక్రమాలు పెరుగుతున్నాయని అన్నారు.వీటినుండి ప్రజలను చైతన్యం చేసేందుకు విలేకరులు వార్తలు రాస్తే దాడులు చేస్తారా అని ప్రశ్నించారు. తక్షణమే దాడికి పాల్పడిన మంత్రి అనుచరులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని,భవిష్యత్ లో జర్నలిస్ట్ లపై దాడులు కట్టడి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం హడ్ హక్ కమిటీ ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఇప్పటికే గతంలో ఆలూరు నియోజకవర్గంలో పేకాట స్టావరాలను పోలీసులు బహిరంగంగా పట్టుకోవడం జరిగిందని చెప్పారు. ఇప్పటికైనా మంత్రి గుమ్మనూరు జయరాం తీరు మారకపోతే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తెలిపారు. అనంతరం కల్లూరు తహసీల్దార్ టి. రమేష్ బాబుకు వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో బి. మోహన్ బాబు,కె.మధు, జేమ్స్,వెంకటేశ్వర్ రెడ్డి, రఫీ,టి.లక్ష్మి నారాయణ, శేఖర్ యాదవ్,నాగరాజు, గంగాధర్,ఆసిఫ్,వెంకటేశ్వర్లు,మధు బాబు,సుంకన్న, బి.వెంకటేష్,షాకీర్ బాషా, ప్రవీణ్ కుమార్,పవన్ కుమార్,ఎ.ఆనంద రెడ్డి,వై. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

About Author