PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మీడియాపై దాడి అరాచక పాలనకు నిదర్శనం : టిడిపి

1 min read

– మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన “ధర్నా” కు మద్దతు తెలిపిన టిడిపి నేతలు

పల్లెవెలుగు న్యూస్ ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు పట్టణంలో తాసిల్దార్ కార్యాలయం దగ్గర మీడియా మిత్రులు మాట్లాడుతూ అనంతపురం జిల్లా ,రాప్తాడు లో సీఎం జగన్ పాల్గొన్న “సిద్ధం” సభలో.. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైసిపి కార్యకర్తలు చేసిన దాడి ఆటవిక చర్య అని, రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది అనడానికి ఈ దాడి నిదర్శనమని టిడిపి నేతలు పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడిని టిడిపి నేతలు తీవ్రంగా ఖండించారు. సోమవారం పాత్రికేయులు ఎమ్మిగనూరు మండల తహసిల్దార్ కార్యాలయం ఎదుట చేపట్టిన నిరసన, ధర్నా కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విలేకరులపై దాడి చేయడమంటే పాత్రికేయులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు పై దాడి చేయడమేనన్నారు. రాష్ట్రంలో.. పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణను విస్మరించి, అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారని ఆరోపించారు. పాత్రికేయులను “నువ్వు ఆంధ్రజ్యోతా” అని మరీ ఆరా తీసి వైసిపి మూకలు భౌతికంగా దాడులు చేయడం సరికాదన్నారు. పత్రికలు ప్రజాస్వామ్యానికి పుత్రికలని పేర్కొన్నారు. పాత్రికేయులపై దాడి చేసిన వైసీపీ మూకలను గుర్తించి వెంటనే అరెస్టు చేసి శిక్షించాలని కోరారు.సార్వత్రిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి ప్రజలు “సిద్ధం”గా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కదిరికోట ఆదెన్న, మాజీ జిల్లా వక్ఫ్ బోర్డు డైరెక్టర్ జి.అల్తాఫ్, మాజీ ఏపీ రాష్ట్ర ఉప్పర (సగర) ఫెడరేషన్ మంచి డైరెక్టర్ ఉప్పర ఆంజనేయులు, కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కురువ సాధికారిక కమిటీ సభ్యులు, అడ్వకేట్ కేటి మల్లికార్జున, మాజీ ఆత్మ చైర్మన్ కందనాతి శ్రీనివాసులు, టిడిపి ఎస్సీ సెల్ నాయకులు రోజా ఆర్ట్స్ ఉసేని, ముస్లిం మైనార్టీ నాయకులు ఆఫ్గన్ వలి భాష, నందవరం మండలం టిడిపి నాయకులు నాగలదిన్నె సంగాల సత్యన్న, తదితరులు పాల్గొన్నారు.

About Author