ప్రతిపక్ష కార్యాలయాలపై దాడి.. సిగ్గుచేటు…!
1 min read– టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి
పల్లె వెలుగు వెబ్ . గడీవేముల: దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రతిపక్ష కార్యాలయాలు..నాయకులు, కార్యకర్తలపై అధికార పార్టీ దాడులకు దిగడం సిగ్గుచేటన్నారు టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకట రెడ్డి. ప్రతిపక్ష నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి… ఇలా దాడులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సోమవారం విద్యుత్ చార్జీల ధరల పెంపు పై గడివేముల మండలంలో ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. ఈ సందర్భంగా గౌరువెంకట రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో పేదలకు మంజూరైన గృహాలను రూపాయికే ఇస్తామని ప్రకటించిన జగన్.. అధికారంలోకి రాగానే కొత్త పథకమంటూ… 40 ఏళ్ల కిందట గృహ నిర్మాణ పథకం కింద నిర్మించుకున్న ఇళ్లను వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా రూ.10వేలు చెల్లించి రిజిష్ట్రేషన్ చేసుకోవాలని చెప్పడం దారుణమన్నారు. నిత్యావసర ధరలు, పెట్రోలు, విద్యుత్ చార్జీల ధరలతో అప్పులపాలైన ప్రజలకు… కొత్తపథకం పేరుతో మరింత ఆర్థిక భారం మోపుతున్నారని విమర్శించారు. ఏపీలో25వేల ఎకరాల్లో అక్రమార్కులు గంజాయి సాగు చేస్తున్నారని, దీనిపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు, దాడులు చేయడం వంటి కొత్త సంప్రదాయం తీసుకొచ్చారని ఎద్దేవ చేశారు.
ఆత్మకూరులో వర్ధన్ సొసైటీ బ్యాంకులో లక్ష రూపాయలు కడితే రెండు లక్షలు ఇస్తామని ప్రజల వద్ద నుండి దోచుకున్నారని దీనిపై టిడిపి శ్రీశైలం పార్లమెంట్ ఇన్చార్జి బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశామన్నారు. ఎవరైనా బాధితులు ముందుకు వస్తే పోలీసు శాఖ ద్వారా న్యాయం జరిగేలా ఫిర్యాదు చేయాలన్నారు . కార్యక్రమంలో టీడీపీ పాణ్యం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, నంద్యాల పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ, మండల కో కన్వీనర్ సత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ బుడ్డ సీతారాం రెడ్డి, మంచాలకట్ట శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర టిడిపి మహిళా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సుభద్రమ్మ, దామోదర్, నాగ శేషులు, వడ్డు ప్రశాంతి గడిగరేవుల సిద్ధం శీను,కృష్ణ మోహన్ రెడ్డి కోరటమద్ది సుకుమార్ ఆచారి,కృష్ణం ఆచారి,దురువేసి కిట్టు, మైనార్టీ నాయకులు రఫిక్ ఫారుక్. కరిమద్దెల శివ రెడ్డి,ఈశ్వర్ రెడ్డి, టిడిపి సర్పంచులు మరియు నాయకులు గ్రామ నాయకులు తెలుగుదేశం పార్టీ అభిమానులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.