NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కవరేజ్ కి వెళ్ళిన విలేఖరి పై దాడి

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  కమలాపురం నియోజకవర్గంలో మాజీ టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సాయినాధ శర్మ తమ వర్గీయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సమయాత్తం అవుతున్నారని తెలుసుకున్న కమలాపురం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పు త్తా నరసింహారెడ్డి తన వర్గీయులతో కలసి రామాపురం లోని శర్మ సాయినాథ వర్గీయులపై దాడి కి పాల్పడుతున్నారని తెలుసుకొని కవరేజ్ కి వెళ్ళిన పత్రికా విలేఖరి శివ కృష్ణారెడ్డి  పై పు త్త నరసింహారెడ్డి వర్గీయులు విచక్షణారహితంగా కట్టెలతో, రాడ్లతో దాడి చేయడంతో అతనికి తలపై తీవ్ర గాయాలు అయ్యాయి, గొడవలతో మాకు సంబంధం లేదు నేను విలేకరిని అని చెప్పినప్పటికీ పు త్త నర్సింహారెడ్డి వర్గీయులు మరింత రెచ్చిపోయి పుత్తా నరసింహారెడ్డి ఆయన తనయులు పుత్తా చైతన్య రెడ్డి, లక్ష్మిరెడ్డి సమక్షంలోని దాడి చేశారని, వారి ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని క్షతగాత్రుడు శివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు,….. విలేకరిపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి…… కమలాపురం నియోజకవర్గం రామాపురంలో గొడవలు జరుగుతున్నాయని తెలిసి కవరేజ్ కి వెళ్ళిన శివా కృష్ణ రెడ్డిని విచక్షణా రహితంగా దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కమలాపురం నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు, ఎ ప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠిన చర్యలు చేపట్టాలని, పత్రికా విలేకరులకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని వారు మండిపడ్డారు, ఎలాంటి వారైనా ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వారిపై తగిన చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.

About Author