ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కోడిగుడ్లతో దాడి
1 min readపల్లెవెలుగు వెబ్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు. భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ఈ దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి .. తిరిగి వస్తుండగా ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్‌పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా