ఉక్రెయిన్ పై 83 క్షిపణిలతో దాడి.. !
1 min readపల్లెవెలుగువెబ్: రష్యా, క్రెమ్లిన్ ప్రాంతాలను అనుసంధానం చేసే కీలకమైన కెర్చ్ వారధి పేల్చివేతను వ్లాదిమిర్ పుతిన్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వంతెన పేల్చివేత వెనుక ఉక్రెయిన్ హస్తం ఉందని రష్యా ప్రభుత్వం ఆరోపించింది. ఇది ఉక్రెయిన్ ప్రభుత్వ ప్రోద్బలిత ఉగ్రవాదం అని పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఉక్రెయిన్ నగరాలపై తాజాగా రష్యా సైన్యం ఏకంగా 83 క్షిపణులను ప్రయోగించింది. గత కొన్నివారాలుగా ప్రశాంతంగా ఉన్న ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కూడా కొన్ని క్షిపణులు తాకినట్టు వెల్లడైంది. భారీ శబ్దాలతో కీవ్ దద్దరిల్లింది. ఈ దాడుల్లో 8 మంది పౌరులు మృతి చెందగా, 24 మంది గాయపడ్డారు. రష్యా భీకరస్థాయిలో క్షిపణి దాడులకు పాల్పడడాన్ని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ జనరల్ వాలెరి జలూజ్నీ నిర్ధారించారు. అయితే, రష్యా ప్రయోగించిన వాటిలో సగం క్షిపణులను తమ బలగాలు గగనతలంలోనే నిరోధించాయని జలూజ్నీ చెప్పారు.