కేంద్ర మంత్రి పై దాడి..?
1 min readపల్లెవెలుగు వెబ్: కేంద్ర మంత్రి మురళీధరన్ కారు మీద దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేసినట్టు కేంద్ర మంత్రి మురళీధరన్ చెబుతున్నారు. తన కారు మీద కర్రలు, రాళ్లతో దాడి చేసినట్టు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఆయన వ్యక్తిగత సిబ్బంది గాయపడినట్టు.. కారు అద్దాలు ధ్వంసమైనట్టు ఆయన తెలిపారు. పశ్చిమ బెంగాల్లోని వెస్ట్ మిడ్నాపూర్ పంచక్కూడ్ లో ఈ దాడి జరిగింది. ఇటీవల ఎన్నికల్లో టీఎంసీ గెలిచాక బెంగాల్ వ్యాప్తంగా భారీ హింస చెలరేగింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.