అప్పు చెల్లించలేదని మహిళాపై దాడి..?
1 min read– చీర లాగి, జాకెట్ చింపి మహిళ అని చూడకుండా కొట్టారు !
– తల్లి కుమారున్ని చితకబాదిన లక్ష్మీరెడ్డి తన బంధువులు
– పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితులు
– కేసు నమోదు చేసిన అర్బన్ సి ఐ విజయ భాస్కర్
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: డబ్బు చెల్లించలేదని పది మందిలో అవమాపరచడమే కాకుండా చీర లాగి, జాకెట్ చింపి తల్లి కుమారుని చితకబాదిన సంఘటన మండల పరిధిలోని కొణిదేల గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు వివరాల మేరకు మండల పరిధిలోని కొనిదేల గ్రామానికి చెందిన బన్నెల విమలమ్మ అనే మహిళ తన బంధువులకు అదే గ్రామానికి చెందిన స్వర్ణ లత వద్ద రూ.లక్ష అప్పుగా ఇప్పించింది. అయితే మూడు నెలలుగా అప్పు తిరిగి చెల్లించలేదని స్వర్ణలత చిన్న అయిన లక్ష్మీ రెడ్డి విమలమ్మను గ్రామంలో అవమానకరంగా ఇంటిదగ్గరకు రావాలని మందలించారు. అయితే విమలమ్మ కుమారుడు బన్నెల బాలరాజు మా అమ్మని అవమానకరంగా మాట్లాడడని లక్ష్మిరెడ్డి ఇంటి దగ్గరకు వెళ్ళి నిలదీశారు. మాటమాట పెరిగి గొడవకు దారి తీసిందని ఆ రోజు నుండి తీసుకున్న అప్పు చెల్లిస్తామని చెప్పి వెళ్లిపోయారు. అయితే బుధవారం సాయంత్రం బాలరాజు లక్ష్మిరెడ్డి కళ్ళం వద్ద ట్రాక్టర్ ఉందేమో అని చూసేందుకు వెళ్లగా అక్కడే ఉన్న లక్ష్మిరెడ్డి అతన్ని చూసి నా కొడకా ఎందుకు వచ్చవని ఇష్టమొచ్చినట్లు తిట్టడం చేస్తుండగా గమనించిన తల్లి విమలమ్మ అక్కడికి వెళ్ళి విడిపించి ప్రయత్నం చేయగా తన చీర లాగి, జాకెట్ చింపి నానా బూతులు తిడుతూ నన్ను నా కుమారుని కళ్ళం దగ్గర లక్ష్మి రెడ్డి, బుజ్జి రెడ్డిలు కొట్టగా మళ్ళీ ఇంటిదగ్గరకు వచ్చి సంజీవరెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, కిట్టు, వెంకటేశ్వర రెడ్డిలు నన్ను నా కుమారున్ని ఎంత వద్దన్నా బట్టలు చిరిగిపోయేలా కొట్టారాని విమలమ్మ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసి విలేకరులతో ఆవేదన వ్యక్తం చేసింది. నాకు న్యాయం జరిగే వరకు ఊరుకునేది లేదని అందువల్లే పోలీసులను ఆశ్రయించామని తెలిపారు. బాధితురాలు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ సి ఐ విజయ భాస్కర్ తెలిపారు.