ఆయుధాలతో దాడి.. బ్యాంకు దోపిడీ !
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళనాడులోని ఫెడ్ బ్యాంక్‌ను కొందరు సాయుధ దొంగలు శనివారం కొల్లగొట్టారు. చెన్నైలోని అరుంబాక్కంలో ఈ దోపిడీ జరిగింది. ఆయుధాలతో బ్యాంకులోకి అడుగుపెట్టిన అగంతకులు క్షణాల్లోనే కోట్లాది రూపాయలు విలువచేసే నగదు, బంగారం చేజిక్కించుకుని వచ్చినంత వేగంగా పరారయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే అన్నానగర్ డిప్యూటీ కమిషనర్ ఘటనా స్థలికి చేరుకున్నారు. వెంటనే దర్యాప్తు చేపట్టారు. దోపిడీ అనంతరం దొంగలు మెరుపువేగంతో పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.