పక్కా ప్లాన్ ప్రకారమే దాడి చేశారా ?
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ స్కీమ్ ను నిరసిస్తూ పక్కా ప్లాన్ ప్రకారమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి జరిగిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్కు రైళ్లలో చేరుకోవాలని ఆందోళనకారులు ముందే నిర్ణయించుకున్నారు. 10 ప్లాట్ ఫామ్లలో మకాం వేయాలని ప్లాన్ వేసుకున్నారు. బస్సుల్లో వచ్చేవాళ్లు ఉదయం 9 గంటల లోపే రావాలని నిర్ణయించుకుని 9 గంటలకు సికింద్రాబాద్ మెయిన్ గేట్ నుంచి లోపలకు వెళ్లారు. ఆ వెంటనే అప్పటికే ప్లాట్ ఫామ్లపై ఉన్న ఆందోళనకారులు హంగామా సృష్టించారు. ముందుగా ప్రయాణికుల ట్రైన్ ఇంజిన్లను ముట్టడించారు. ఇంజిన్ల ముందు వాహనాలు వేసి తగులబెట్టారు. ఇంజిన్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత బోగీలను ధ్వంసం చేసుకుంటూ వెళ్లారు. ఆ తర్వాత బోగీలను తగలబెట్టారు. అనంతరం పట్టాలపై నిలబడి బోగీలపై రాళ్లు రువ్వారు.