మసీదుకు వెళ్లి వస్తుండగా దాడి-తలకు బలంగా గాయం
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో బుధవారం 6:30 గంటల సమయంలో గ్రామానికి చెందిన సయ్యద్ జలాలుద్దీన్(75)మసీదులో నమాజ్ చేసుకొని ఇంటికి వెళుతూ ఉండగా ఇదే గ్రామానికి చెందిన సత్తార్ మరియు వారి కుటుంబ సభ్యులు కాచుకొని ఉండి కర్రలతో జలాలుద్దీన్ తలపై బలంగా కొట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు.ఈసందర్భంగా కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు గత నెల రోజుల నుండి ఈరెండు కుటుంబాల మధ్య గొడవలు మొదలయ్యాయని మేము బయటికి వెళ్లాలంటే వారి ఇంటి ముందరే రస్తాలో వెళ్లాలని మేము వారి ఇంటి ముందర రస్తాలో వెళ్లకుండా గోడ కట్టారని దీనిపై మాట మాట పెరిగి గొడవకు దారితీసిందని జలాలుద్దీన్ కు తలకు బలంగా దెబ్బలు తగలడం వలన రక్తం కారుతూ ఉండడంతో మిడుతూరు ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు.తలకు 10 కు ట్లు పడ్డాయని ఇంకా స్పృహలో నుంచి రాలేదని ఆయన కుమారుడు షేక్షావలి అన్నారు. జలాలుద్దీన్ చిన్న కుమారుడు సయ్యద్ ఉస్మాన్ భాష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ లో అబ్దుల్ సత్తార్ మియ్య,ఖాజాబీ,బషీర్,నసీమా, యాస్మిన్ లపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మారుతి శంకర్ తెలిపారు.జలాలుద్దీన్ పెద్ద కుమారుడు షేక్షావలి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈగొడవలు జరగడానికి కారణం రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ షుకూర్ వెనక ఉండి గొడవలు సృష్టిస్తూ ఉన్నారని ఈయన గ్రామాల్లో మర్డర్లు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని షేక్షావలి పాత్రికేయులతో అన్నారు.