నాటు సారాబట్టీలపై దాడులు.. బెల్లం ఊట ధ్వంసం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఉలిందకొండ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి SHOగా విధులు నిర్వహిస్తున్న ట్రైనింగ్ డిఎస్పి ప్. భావన ఆధ్వర్యంలో ఉలిందకొండ ఎస్సై మరియు సిబ్బంది ఆదివారం కర్నూలు జిల్లా కల్లూరు మండలం ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజరా గ్రామం కొల్లంపల్లి తండా గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలలో తాండ ప్రజలు కొంతమంది అక్రమంగా నాటు సారా తయారు చేయడానికి ఏర్పాటు చేసుకున్న 9 సారాబట్టీలపై దాడులు నిర్వహించి సుమారుగా 2500 లీటర్ల బెల్లం ఉటను ధ్వంసం చేయడం జరిగింది.2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా కొల్లంపల్లి తండా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా అక్రమంగా నాటుసారా తయారుచేసి చుట్టుపక్కల గ్రామాలలో విక్రయిస్తున్న సందర్భంగా నాటు సారాను సేవించి కొంతమంది గొడవలకు కారణం అవుతు, కొన్ని సందర్భంగా గ్రామాలలో శాంతి భద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం వుంటుంది కావున కొల్లంపల్లి తండా గ్రామ ప్రజలు ఇప్పటినుంచి నాటు సారా తయారు చేయడం, విక్రయించడం మానుకోవాలని కోరడమైనది. సారా తయారీమానని పక్షంలో చట్టపరంగా గట్టి చర్యలు తీసుకుంటామని, అట్టి వారిపై PD Act కూడా నమోదు చేస్తామని నాటుసారా తయారీ దారులను హెచ్చరించడం జరుగుచున్నది.