ప్రభుత్వ అసమర్థతతోనే హిందువుల పై దాడులు !
1 min read
పల్లెవెలుగువెబ్ : హనుమాన్ ర్యాలీలో దాడి ఘటనపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలకు రక్షణ కల్పించలేనివారు.. సమర్ధవంతమైన పాలకుడు ఎలా అవుతారు? అని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థతతోనే హిందువులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇంకెంత మంది హిందువులు రక్తం చిందించాలన్నారు. ప్రతిపక్షాలను హౌస్ అరెస్టుల ద్వారా కట్టడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగడతామని హెచ్చరించారు.