PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జర్నలిస్టులపై దాడులు హేయమైన చర్య

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: అనంతపురం జిల్లా  రాప్తాడు సిద్ధం సభ లో వైసిపి  మూకలు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై దాడికి పాల్పడడం సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గుచేటని విద్యార్థి, ప్రజాసంఘాల నాయకులు ,పాత్రికేయులు  అన్నారు. సోమవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలో ని పటేల్ సెంటర్ నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు జర్నలిస్టులు నిరసన ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ దామోదర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు.ఈ  కార్యక్రమానికి సిపిఐ సిపిఎం, ఐకాసా విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ విది నిర్వహణలో భాగంగా ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫర్ కృష్ణ పై వైసీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేయడం అమానుషమన్నారు. ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన రౌడీ మూకలను, సభా అధ్యక్షత వహించిన రాప్తాడు ఎమ్మెల్యే పై కేసు నమోదు చేయాలని విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు  నాగేశ్వరావు మాట్లాడుతూ జర్నలిస్టులపై పదేపదే వైసిపి ప్రభుత్వం దాడులు చేయడం పరిపాటిగా మారిందన్నారు. ఇలాంటి దాడులు పునరావృతం అయితే జర్నలిస్టుల పక్షాన పోరాటాలు చేసేందుకు సిపిఎం సిద్ధంగా ఉందన్నారు.రైతు సంఘం నాయకుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజాసమస్యలను కలిగించే జర్నలిస్టులపై దాడులు చేయడం హేయమైన చర్య అని ఆయన అన్నారు.ఎఐ ఎస్ ఎఫ్ నాయకుడు మహానంది మాట్లాడుతూ సమాజ హితం కోరే జర్నలిస్టుల రక్షణ కోసం సుప్రీంకోర్టు తీసుకొచ్చిన చట్టాలు పేపర్ మీద కాగితాలు గానే ఉన్నాయి తప్ప జర్నలిస్టుల పై దాడులు ఆగడం లేదని ఆయన అన్నారు. పదేపదే జర్నలిస్టులపై దాడులు చేయడం అయితే జర్నలిస్టుల పక్షాన పోరాటాలు చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఐకాసా నాయకుడు ఆది, బీసీసంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు  కురుమూర్తి, సిపిఎం రైతు సంఘం నాయకుడు రాజు,    ఏపీయూ డబ్ల్యూజే   నందికొట్కూరు గౌరవాధ్యక్షుడు రామాంజనేయులు, జర్నలిస్టులు వెంకటేష్ , భాను, శేషు, సురేష్,  జయరాజు, గోపి,  సామన్న నాగరాజు, మల్లికార్జున, నజీర్, గంగాధర్, రాజా , , వాడాల శేషు, ఉసేనాళం, రహమ్మతుల్లా, నల్లమల స్వాములు, మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.

About Author