జర్నలిస్టులపై దాడులు సిగ్గుచేటు… సిపిఐ
1 min read– రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ రామచంద్రయ్య
పల్లెవెలుగు వెబ్ , పత్తికొండ: జర్నలిస్ట్ పై దాడికి పాల్పడిన వారి పై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని సోమవారం ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నాలుగు స్తంభాల వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి. రామచంద్రయ్య మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాలనలో p జర్నలిస్టులపై దాడులు జరగడం సిగ్గుచేటని అన్నారు.సమాజంలో జరుగుతున్న అవినీతిపై విలేకరులపై దాడి చేయడం ప్రజాస్వామ్యంలో ఎంత మాత్రం తగదని, ప్రజాసంఘాల నాయకులు సిపిఐ కారన్న సిపిఎం మండల కార్యదర్శి దస్తగిరి బురుజల రాముడు లోక్సత్తా పార్టీ ఆనందాచారి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూూ, కర్నూలు ఉమ్మడి జిల్లా మహానందిలో వార్తా విలేకరిపై దాడి చేయడం దారుణం అన్నారు వార్త విలేకరిపై వైసీపీ గూండాలు దాడి చేయడం మహానంది మండలంలో రిపోర్టర్ మధు పై ఎమ్మెల్యే శిల్ప సమక్షంలోనే వైసీపీ నాయకులు వీరంగం సృష్టించారు అని పేర్కొన్నారు. మహానంది రిపోర్టర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు గ్రామ సచివాలయావరణలో జగనన్న సురక్షిత కార్యక్రమం తదనంతరం న్యూస్ కవరేజ్ కి వెళ్ళిన వార్త రిపోర్టర్ పై తిమ్మాపురం చెందిన వైసిపి నాయకులు వీరారెడ్డి మరియు ఆయన అనుచరులు దాడి చేయడం బాధాకరమన్నారు. ఆయన పైన వెంటనే ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయాలని వారుుు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు రాజా సాహెబ్ , కారన్న్, సురేంద్ర కుమార్, ఏం. అశోక్ కుమార్, తిరుపాలు, పాత్రికేయులు ఎం రంగన్న, సాలు రంగడు, రాజేష్, పకీరప్ప తదితరులు పాల్గొన్నారు.