ముస్లిం, మైనారిటీ దళితులపై దాడులు అమానుషం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నేటికీ ముస్లిం,మైనారిటీ దళితులపై దాడులు, జరగడం అనాగరిక చర్య అని ఆవాజ్ కమిటీ నాయకులు తాజ్ మహమ్మద్ అన్నారు.మంగ్లవారం స్థానిక నాలుగు స్తంభాల కూడలి వద్ద ఆవాజ్ మరియు కెవిపిఎస్ ఆధ్వర్యంలో పూలే దీక్ష చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీలు మరియు దళిత సామాజిక వర్గం ప్రస్తుతం దేశంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యల దృష్ట్యా పూలే దీక్ష చపట్టనున్నారు. ముస్లిం మైనార్టీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో హేయమైన చర్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. హిజాబ్ ధరించే విషయంలోనైతేనేమి, మసీదులను కూలగొట్టే విషయంలోనైతేనేమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పని దిక్కుమాలిన చర్యగా ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు.కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గిత్తరి రమేష్ మాట్లాడుతూ, దళితుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి వీడనాడి దళితులకు సర్వ సమాన హక్కులు రక్షణలు కల్పించాలని అన్నారు. స్టూడెంట్స్ స్కాలర్షిప్లను బిజెపి గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ప్రతి సంవత్సరం తగ్గుముఖం పట్టడమే కాకుండా చివరికి ఈ స్కాలర్షిప్స్ ను కూడా తీసివేసే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు. దీక్ష చేపట్టిన ఆవాజ్ కెవిపిఎస్ నాయకులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పత్తికొండ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బోయ క్రాంతి నాయుడు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కమ్మర హరికృష్ణ ఆచారి, నాయి బ్రాహ్మణ నంద సేవా సంఘం జిల్లా నాయకులు మంగళ రవిచంద్ర, రాష్ట్ర బీసీ సంఘం నాయకులు ఆస్పరి శ్రీనివాసులు, ఏపీయూడబ్ల్యూజే పత్తికొండ నియోజకవర్గం అధ్యక్షుడు సాలురంగుడు తదితర ప్రజా సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వాలకు అర్థమయ్యే విధంగా ప్రజలకు వివరించారు.