PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నాటు సారా స్ధావరాల పై విస్తృతంగా దాడులు..

1 min read

జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్  ఐపియస్

కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లో భారీగా పట్టుబడిన నాటుసారా.

రానున్న ఎన్నికల నేపథ్యంలో  విస్తృతంగా దాడులు.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  జిల్లాలో ఎక్కడైనా నాటు సారా, మద్యం అక్రమ రవాణా జరుగుతుంటే ప్రజలు డయల్ 100 గాని, స్ధానిక పోలీసులకు సమాచారం అందించండి. నివారo జిల్లా ఎస్పీ శ్రీ జి. కృష్ణకాంత్  ఐపియస్ గారి ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్ డిఎస్పీ విజయ శేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు రెండవ పట్టణ పోలీసులు కర్నూలు బంగారు పేటలో నాటు స్దావరాల పై పోలీసులు దాడులు నిర్వహించారు.ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ దాడుల్లో 19 వందల లీటర్ల నాటు సారా ఊట బెల్లం ను ధ్వంసం చేసి, 250 లీటర్ల నాటు సారా ను స్వాధీనం చేసుకున్నారు.ఈ దాడులలో కర్నూలు టు టౌన్ సిఐ ఇంథియాజ్ భాషా  , ఎస్సై లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం, కర్నూలు.

About Author