నాటు సారా బట్టీలపై దాడులు
1 min read–నేరాలకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు:ఏఎస్పీ ఆర్ రమణ
పల్లె వెలుగువెబ్, గడివేముల:నంద్యాల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నంద్యాల అడిషనల్ ఎస్పీ R. రమణ సెబ్ ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలో తిరుపాడు గ్రామం ఊరి బయట కుందు నది పరివాహక ప్రాంతాల్లో నాటు సారా బట్టిని ధ్వంసం చేశారు సుమారు 2000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. అనంతరం తిరుపాడు గ్రామంలో అడిషనల్ ఎస్పీ పాణ్యం సర్కిల్ సిఐ వెంకటేశ్వరరావు ఎస్సై బిటి వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ఎవరైనా నాటు సారా తయారీ, రవాణా అమ్మకం చేసిన ఎడల వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సారా తయారు చేసేవాళ్లు ఎవరైనా తమ పద్ధతిని మార్చుకోకపోతే PD యాక్ట్ పెట్టి జైలుకు పంపించేందుకు కూడా వెనుకాడబోమని ఈ సందర్భంగా తెలియజేశారు. సారా తయారీదారుల వివరాలను పోలీసులకు తెలపాలని గ్రామంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగిన పోలీసు వారి దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు తెలిపారుఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆర్.రమణ సేబ్ సీఐ B. నాగమణి , ఎస్సై శ్రీ లక్ష్మీ . సీఐ వెంకటేశ్వరరావు, గడివేముల ఎస్సై B.T.వెంకటసుబ్బయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.