నాటు సారా స్థావరాలపై దాడులు
1 min read
ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సీఐ భోగేశ్వర రావు
రెండు లీటర్ల నాటు సారా స్వాధీనం కేసు నమోదు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు :డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఏలూరు, శ్రీలత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ఏలూరు కె.వి.యన్.ప్రభుకుమార్, మరియు డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ (డిపిఈఓ) ఏలూరు జిల్లా, ఏ.ఆవులయ్య వారి ఆదేశాలు ప్రకారము నవోదయం 2.0 కార్యక్రమం లో భాగంగా చింతలపూడి ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిదిలో టి.నర్సాపురం మండలం కృష్ణాపురం గ్రామము లో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించగా భూక్యా రాజు అను వ్యక్తి వద్ద నుండి 2 లీటర్ల నాటు సారాను స్వాధీన పరచుకొని అతని పై కేసు నమోదు చేయడమైనది.ఈ దాడులలో ఎన్ఫోర్స్మెంట్ ఏలూరు సి.ఐ. భోగేశ్వరరావు, ఈఎస్టీఎఫ్ ఏలూరు సి.ఐ. ఆర్.సత్యవతి, స్థానిక చింతలపూడి ఎక్సైజ్ ఎస్.ఐ.లు అబ్దుల్ ఖలీల్, జె.జగ్గారావు మరియు సిబ్బంది పాల్గొన్నారని ఎక్సైజ్ సి.ఐ. పి.అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.