నాటు సారా స్థావరాలపై దాడులు
1 min read
కర్నూలు,న్యూస్ నేడు: ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో బంగారు పేట లో నాటు సారా సావరాలపై దాడులు చేయడం జరిగింది ఈ దాడులలో సుమారు 300 లీటర్ల నాటు సారా కు ఉపయోగపడు బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగింది మరియు 10 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వసంత అనే మహిళ ను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపడమైనది తదుపరి ఓర్వకల్లు మండలం హుసేనాపురం వద్ద 12 మద్యం బాటిళ్ల ను స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దాడులలో ఎస్సై రెహనా మరియు నవీన్ బాబు మరియు సిబ్బంది రామలింగయ్య, చంద్రపాల్, మధు సుదర్శన్ రాజు తదితరులు పాల్గొన్నారు.