అట్టహాసంగా బండలాగుడు పోటీలు
1 min read– మొదటి విజేతగా బీరం బుల్స్ రోలింగ్ మేడం
– బహుమతులను అందజేసిన కమతం రాజశేఖర రెడ్డి,కాటం మురళీధర్ రెడ్డి,రమేష్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని ఉప్పలదడియ గ్రామంలో శ్రీరామనవమి,గుడ్ ఫ్రైడే,రంజాన్ పండుగ సందర్భంగా గ్రామంలో ఆరు పండ్ల వృషభ రాజముల బండలాగుడు రాష్ట్రస్థాయి పోటీలు కమతం రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.మంగళవారం ఉదయం టిడిపి మండల కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి, కాటం మురళీధర్ రెడ్డి,కమతం జయరామిరెడ్డి,కాత రాజారెడ్డి మరియు రాజశేఖర్ రెడ్డి పోటీలను ప్రారంభించారు.ఈపోటీలలో మొత్తం 9 జతలు పాల్గొన్నాయని వీటిలో మొదటి విజేతగా అలగనూరు గ్రామానికి చెందిన బీరం బుల్స్ రోలింగ్ మేడం-40 వేలు,2వ బహుమతిగా ప్యాపిలి మండలం డి.రంగాపురం గ్రామానికి చెందిన జూటూరు రామచంద్రారెడ్డి-30 వేలు,3వ బహుమతిగా ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామానికి చెందిన రాగుల వెంకట రామిరెడ్డి-20 వేలు,4 వ బహుమతిగా సిరివెళ్ల మండలం బోయలకుంట్ల గ్రామానికి చెందిన గిత్తల సుభాన్-15 వేలు,5వ బహుమతి తుమ్మలూరు గ్రామానికి చెందిన తెలుగు పల్లవి-10 వేలు,ఆరవ బహుమతి మంగలి పల్లె గ్రామానికి చెందిన మురళీమోహన్ మరియు కంబైండ్ కృష్ణ నగర్ కు చెందిన వెంకటరామిరెడ్డి-6వేలు విజయం సాధించాయ ని కమతం రాజశేఖర్ రెడ్డి తెలిపారు.గెలుపొందిన జతలకు బహుమతులను నగదును ఖాతా రమేష్ రెడ్డి, కమతం జయరామిరెడ్డి,అందజేశారు.అదేవిధంగా మిగతా మూడు జతలకు ప్రతి జతకు మూడు వేల రూపాయలు అందజేసినట్లు అంతేకాకుండా ఒక జతకు కాడిమాను విరిగినందుకు గాను గ్రామ రైతులు కలిసి ప్రోత్సాహకంతో మరో మూడు వేల రూపాయలను వారికి అందజేసినట్లు ఆయన తెలిపారు.వచ్చిన ప్రజలందరికీ పల్లె జ్ఞానానంద రెడ్డి భోజన వసతిని కల్పించారు.ఈకార్యక్రమంలో కమతం వీరారెడ్డి, ఆనందరావు,రత్నపాల్,పక్కిరయ్య,సుల్తాన్,అతావర్, సర్వేయర్ సుల్తాన్,బోయ శీను, ఖాజ ప్రజలు పాల్గొన్నారు.