NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అట్టహాసంగా బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు

1 min read

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : శాంతియుత సమాజ స్థాపన కోసం తన రక్తం చిందించి, తన జీవితమే ఒక సందేశంగా జీవించిన కరుణామయుడు అయిన యేసు క్రీస్తు, జన్మదిన సందర్భంగా బీరం శ్రీధర్ రెడ్డి పాఠశాలలో క్రిస్మస్ ముందస్తు వేడుకలు నేడు ఘనంగా నిర్వహించడం జరిగింది.  కార్యక్రమంలో బీరం పాఠశాల కరస్పాండెంట్ సుబ్బారెడ్డి మరియు చైర్ పర్సన్ సరస్వతమ్మల మాట్లాడుతూ యేసు క్రీస్తు శాంతి,కరుణ, సహనం,ప్రేమ విలువలను ప్రపంచానికి చాటిన వ్యక్తి అని, అతని బోధనలు విశ్వమానవ సహోదరత్వానికి దోహదం చేస్తాయని,అటువంటి ప్రేమ భావాన్ని, సేవా తత్పరతను బోధించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు మన పాఠశాలలో జరుపుకోవడం ఈరోజు సంతోషకరమైన రోజు అని వారు తెలియజేశారు.బీరం పాఠశాల డైరెక్టర్ స్వాతి శ్రీకాంత్  మాట్లాడుతూ పిల్లలకి క్రిస్మస్ పండుగ అంటే చాలా ఇష్టమని ఎందుకనగా క్రిస్మస్ టైంలో శాంతా టాటా వచ్చేస్తాడు, మనంఆశ్చర్యపోయే గిఫ్ట్లు తెస్తాడు, అందరిలో ఆనందం నింపుతాడు, మంచి మనసుతో మెప్పిస్తాడు. అలాగే ప్రేమకు ప్రపంచశాంతికి క్రీస్తు సందేశం సదా ఆచరణీయమని వారు తెలిపారు. పిల్లలు శాంతా క్లాస్ మరియు ఏంజెల్ డ్రెస్ లలో క్రిస్మస్ పాటలు పాడారు మరియు డాన్సులు చేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్వేతా ,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

About Author