PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అట్టహాసంగా జెకె కరాటే అకాడమీ నాలుగో వార్షికోత్సవం

1 min read

– టీజీ భరత్.టిడిపి ఇన్చార్జ్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక కర్నూలు జిల్లా వెంకటరమణ కాలనీ జే కే కరాటే & బాక్సింగ్ అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన నాలుగవ వార్షికోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి టీజీ భరత్ మాట్లాడుతూకరాటే ప్రతి ఒక్కరికి ఆత్మ రక్షణకు ఉపయోగపడుతుందని అమ్మాయిలకు మరింత ముఖ్యంగా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మన కర్నూలు జిల్లా నుంచి జాతీయస్థాయిలో పథకాలు సాధించిన విద్యార్థులకు అలాగే బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులకు అభినందిస్తూ ఆయన తన కరాటే మీద ఉన్న అభిమానాన్ని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం కరాటే బ్లాక్ బెల్ట్ సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ల ప్రధానం చేసి కరాటే క్రీడను జేకే అకాడమీలో ఎంతో దిగ్విజయంగా నిర్వహిస్తున్నందుకు కరాటే అకాడమీ ఇన్చార్జ్ జగదీష్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసి జెకె కరాటే అకాడమీ కి ముందుండి మేము సహాయ సహకార అందిస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమానికి మరో విశిష్టత  డాక్టర్ హరికిషన్ గారు మాట్లాడుతూ చిన్నప్పటినుంచే కరాటే నేర్చుకోవడం వల్ల ఎంతో శారీరకంగా దృఢంగా ఉంటారని తెలుపుతూ మన కర్నూలు జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి వరకు కరాటే లో ఎదగాలని ఆయన ఈ సందర్భంగా తన ఆశాభావాన్ని తెలియజేశారు. అలాగే అకాడమీలో ఇంతవరకు విద్యార్థులు సంపాదించిన సాధించిన విజయాలను స్ఫూర్తిదాయకంగా నిల్చాలని తెలుపుతూ మన కేఎన్ఆర్ స్కూల్ కరస్పాండెంట్ President of GKMA, AP టీ గోపీనాథ్ సార్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నుంచి వివిధ కరాటే మాస్టర్లు ఆరిఫ్ హుస్సేన్ ,ఫయాజ్ ,రమణ పాల్గొన్నారు.

About Author