దేవినేని పై హత్యాయత్నం కేసు.. చంద్రబాబు ఆగ్రహం
1 min readపల్లెవెలుగు వెబ్ : మాజీ మంత్రి దేవినేని ఉమపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేని ఉమపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టారని మండిపడ్డారు. తెదేపా నేతలపై హత్యయత్నం కేసు పెడతారా ? అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో చంద్రబాబు ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉమ అరెస్టు, ఇతర విషయాలపై ఆయన పార్టీ నేతలతో చర్చిస్తారు.
తెదేపా నేతల గృహ నిర్భందం :
మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్టును నిరసిస్తూ కృష్ణా జిల్లా వ్యాప్తంగా తెదేపా నేతలు,కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, కొనకళ్ల నారాయణ, వర్ల రామయ్య, తంగిరాల సౌమ్య తదితరులను హౌస్ అరెస్ట్ చేశారు.