ట్రైనీ మహిళ ఎస్సై పై అత్యాచార యత్నం !
1 min readపల్లెవెలుగు వెబ్ : తొర్రూరు సబ్ డివిజన్ లోని మరిపెడ ఎస్సై పొలిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన పై అత్యాచారయత్నం చేశాడని ట్రైనీ మహిళా ఎస్సై వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ స్టేషన్ కు వచ్చి విచారణ చేపట్టారు. సాయంత్రం ఎస్సై శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి తప్పుగా ప్రవర్తించినందుకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. ఎస్సైని హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ఆదేశించారు. ఎస్సై పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడ నమోదైంది. 12 లక్షల విలువైన నల్లబెల్లం అక్రమ రవాణ అడ్డుకోవడంతో ఎస్సీ శ్రీనివాసరెడ్డికి ఉదయం పోలీస్ శాఖ రివార్డు ఇచ్చింది. అత్యాచార ఆరోపణలతో సాయంత్రం సస్పెండ్ చేసింది.