NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హిళా జ‌ర్నలిస్టు ఆత్మహ‌త్యాయ‌త్నం.. ఓ నేత వేధింపులే ..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: హైద‌రాబాద్ కు చెందిన ఓ మ‌హిళా జ‌ర్నలిస్టు ఆత్మహ‌త్యాయ‌త్నానికి పాల్పడ్డారు. పాత‌బ‌స్తీ డ‌బీర్ పురాకి చెందిన ఎంబీటీ నేత స‌లీం వేధిస్తున్నార‌ని ఆమె నిద్రమాత్రలు మింగింది. గుల్షన్-ఏ-ఇక్బాల్ కాల‌నీకి చెందిన స‌య్యదా నాహిదా ఖాద్రీ ఓ న్యూస్ చాన‌ల్ లో జర్నలిస్టుగా ప‌నిచేస్తున్నారు. ఎంబీటీ నేత స‌లీం ఆమెపై అసభ్యక‌ర వీడియోలు, ఫోటోలు సోష‌ల్ మీడియాలో అప్ లోడ్ చేస్తున్నారు. మాన‌సిక ఒత్తిడి గురైన ఖాద్రీ నిద్రమాత్రలు మింగి ఆత్మహ‌త్యాయ‌త్నం చేశారు. వెంట‌నే ఆమెను ఓవైసీ ఆస్పత్రికి త‌ర‌లించారు. ఎంబీటీ నేత స‌లీంను పోలీసులు అరెస్టు చేశారు. పోలీస్టేష‌న్ నుంచి రిమాండ్ కు త‌ర‌లించే స‌మ‌యంలో మ‌జ్లిస్ కార్యకర్తలు ఎంబీటీ నేత సలీం మీద దాడికి య‌త్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

About Author