అటు, ఇటు కదులుతూ.. సూచీల్లో ఊగిసలాట ధోరణి !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నాయి. ఒమిక్రాన్ భయాలు ఉన్నప్పటికీ.. బడ్జెట్, త్రైమాసిక ఫలితాల దన్నుతో గత కొన్ని రోజులుగా సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 18000 పైన ట్రేడ్ అవుతోంది. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమై తర్వాత నష్టాల్లోకి జారుకున్నాయి. మళ్లీ లాభాల్లోకి ప్రవేశించాయి. ఉదయం 11:50 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 193 పాయింట్ల లాభంతో 60589 వద్ద, నిఫ్టీ 45 పాయింట్ల లాభంతో 18048 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 18000 స్థాయి పైన కొనసాగితే సూచీల్లో మరింత అప్ సైడ్ మూవ్ మెంట్ ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.