PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ఉరుకుంద’ క్షేత్రం.. 30న ఏపీ టూరిజం రెస్టారెంట్​కు వేలం..

1 min read

నిర్మాణ దశలో నిలిచిన టూరిజం రెస్టారెంట్​కు 15 ఏళ్లు లీజు

  • జిల్లా పర్యాటక , సాంస్కృతిక అధికారి పి.విజయ

పల్లెవెలుగు: కర్నూలు జిల్లా ఆదోని మండలము ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి పుణ్యక్షేత్రం వద్ద నిర్మాణ దశలో ఉన్న ఏపీ టూరిజం రెస్టారెంట్​కు బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇచ్చేందుకు సంసిద్ధంగా ఉన్నట్లు  జిల్లా పర్యాటక , సాంస్కృతిక అధికారి పి.విజయ తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు జిల్లా పర్యాటక శాఖ కార్యాలయం ( కలెక్టరేట్​)లో వేలం నిర్వహించనున్నట్లు సోమవారం ఓ ప్రకటనలో ఆమె పేర్కొన్నారు.

నిబంధనలు

1.  వేలం పాటలో పాల్గొను వారు రూ.20,000/-(అక్షరాల ఇరవై వేల రూపాయలు మాత్రమే)

    ధరావత్తును  Demand Draft గా “District Collector & Chairman, District Tourism Council,  

     Kurnool”   వారి పేరట తీసి వేలం పాటకు  ముందు జిల్లా పర్యాటక & సాంస్కృతిక ఆధికారి,

     కర్నూలు వారికి  అందజేయవలెను.  గెలుపొందని పాటదారుని ధరావత్తు మొత్తం

     రూ.20,000/- వాపసు ఇవ్వబడును.  బహిరంగ వేలంలో పాల్గొనదల్చిన వారు పాల్గొనుటకు     

     రూ.1,000/-(వెయ్యి రూపాయలు) ప్రవేశ రుసుము  చెల్లించవలెను (ఇది తిరిగి చెల్లించబడదు) 

2.   వేలములో అత్యధికంగా పాట పాడినవారికి  ఏ.పి.టూరిజం  రెస్టారెంట్  ను(నిర్మాణ దశలో 

             ఆగిపోయిన)  15 సం. ల కాల పరిమితితో లీజుకు నడుపుకొనుటకు అనుమతి ఇవ్వబడును.  

            గడువు ముగిసిన  తరువాత వేలం మరలా నిర్వహించపడును. 

3.   వేలములో పాడిన ఆధిక పాట మొత్తము సొమ్మును వేలం జరిపిన తేదీ నుండి 3 రోజులలోగా

      జిల్లా కలెక్టర్ మరియు  ఛైర్మన్, జిల్లా పర్యాటక  మండలి, కర్నూలు వారి పేర డిమాండ్ 

      Draft రూపేణ చెల్లించవలెను.

4.   వేలములో గెలుపొందిన పాటదారు  ధరావత్తు సొమ్ము(సెక్యూరిటి డిపాజిట్) రూ.30,000/-

      జిల్లా  కలెక్టర్ మరియు  ఛైర్మన్, జిల్లా పర్యాటక  మండలి, కర్నూలు వారి పేర డిమాండ్

       Draft  రూపేణ చెల్లించవలెను.  నిబంధనలు ఉల్లంఘిచిన  మరియు ఏ.పి.టూరిజం 

       రెస్టారెంట్ కు నష్టం వాటిల్లినచో  ఈ ధరావత్తు సొమ్ము జప్తు  చేయబడును.

5.   రెస్టారెంట్ యొక్క కరెంట్,నీరు  మరియు ఇతర మెయింటెనెన్స్  ఖర్చులు, స్థానిక సంస్థలకు 

      మరియు  ప్రభుత్వంనకు చెల్లించవలసిన పన్నులు ఇతరములు ఏవైనా  ఉన్నచో సదరు

      కాంట్రాక్టరు  భరించవలెయును.  

6.   ఏ.పి.టూరిజం రెస్టారెంట్ ను   పరిశుభ్రముగా  ఉంచవలెను.

7.   ఇతర నిబంధనలు ఏవైన ఉన్నచో వేలం సమయములో తెలుపబడును. ఈ వేలం విషయములో  తుది నిర్ణయాధికారములు  అన్నియు  జిల్లా కలెక్టర్,  కర్నూలు  వారికి కలవు.

About Author