PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈరోజు మిడుతూరులో షాపింగ్ కాంప్లెక్స్ వేలం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న 14 షాపింగ్ కాంప్లెక్స్ లకు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఈరోజు(28వ తేదీ మంగళవారం)ఉదయం 10.30 ని.లకు షాపులకు వేలం నిర్వహిస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి సుధీర్ నందకుమార్ తెలిపారు.ఆత్మకూరు డివిజనల్ పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ వేలం పాటలో పాల్గొనేవారు మిడుతూరు గ్రామానికి చెందిన వారై ఉండాలని అదేవిధంగా గ్రామపంచాయతీకి వారు ఎటువంటి బకాయిలు ఉండకూడదని అన్నారు.వేలంపాటలో షాపును దక్కించుకున్న వారు మాత్రమే వ్యాపారం చేయాలి.వేలంపాటలో పాల్గొనదలచిన వారు పదివేల రూపాయలు ధరావత్తు కట్టి వేలం పాటలో పాల్గొనాలని పంచాయతీ కార్యదర్శి సుధీర్ తెలిపారు.

About Author