మహా శివరాత్రి కి ముస్తాబైన రుద్ర కోటేశ్వర స్వామి
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గo లోని ఆత్మకూరు – వెలుగోడు మధ్య నల్లకాల్వ గ్రామానికి 15 కి.మీ దూరంలో నల్లమల అడవిలో వెలిసిన ప్రముఖ శైవ క్షేత్రo రుద్రాణి సమేత రుద్రకోటేశ్వర స్వామి దేవాలయం మహాశివరాత్రి కి ముస్తాబైనది.ఈ దేవాలయం నకు పురాణ చరిత్ర కలదు.1925 లో చండ్ర తిరుపెమ్ రెడ్డి ఈ ప్రాంతంలో పశువుల ను మేపుతూ చెట్టు నీడన విశ్రమించిన సమయంలో కలలో రుద్ర కోటేశ్వర స్వామి కనిపించి సమీపంలో ని పుట్టలో శివలింగం ఉందని,ఆ శివలింగాన్ని జీర్ణోద్ధరణ గావింపుమని అజ్ఞాపించారు. పుట్ట ను త్రవ్వి చూడగా శివలింగం బయట పడింది. ఆ శివలింగం ను చుట్టు ప్రక్కల గ్రామస్థుల సహకారంతో జీర్ణోద్ధరణ గావించినట్లు శాసనములు తెలుపు చున్నవి. అప్పటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలను వారి వంశీకులు వైభవంగా జరుపుతున్నారు.ఈ మహక్షేత్రం లో ఈశ్వరుడు స్వయంభూ లింగరూపంలో వెలసినాడని పురాణ గాథలు చెపుతున్నాయి.ఈ క్షేత్రం లో పూర్వం రావణ సoహరణoతా రం శ్రీరామచంద్రులు ఈ స్వయంభూ శివలింగాన్ని దర్శించి తరించి నట్లు చరిత్ర చెబుతోంది.బ్రహ్మాది దేవతలు , సకల మహర్షులు ఈ క్షేత్రాన్ని నిత్యం దర్శించుకుంటున్నారని ప్రజా వాక్కు . శ్రీ లక్ష్మి సమేతుడై విష్ణు మూర్తి ఇచ్చట మల్లికార్జున స్వామిని సేవిస్తుంటారని స్థల మహిమ చాటు తున్నది.ఈ క్షేత్రం లో నేటికి కూడా ఈశ్వరుడు జ్యోతి రూపంలో , నాగేంద్రుడు రూపములో కొందరి భక్తులకు దర్శనము ఇస్తున్నట్లు అందరూ చెపుతారు.క్షేత్రం లోని కోనేటి నీరు ఎల్లప్పుడూ గోరు వెచ్చగా ఉండటం ప్రత్యేకత. ఈ మహక్షేత్రం ను దర్శించే వారు దారి తప్పినచో కోయదంపతుల రూపంలో రుద్రకోటేశ్వర స్వామి క్షేత్రం నకు దారి చూపడం జరుగుతుందని ప్రజల నమ్మకం .ఈ క్షేత్రం నకు ఈశాన్యం దిక్కున గల కల్పవృక్షం నకు ఐదు కొమ్మలు కలవు.బూడిద రంగులో ఉన్న ఈ చెట్టును ఎచ్చట తాకినను పాలు స్రవించును. ఈ చెట్టు నీడన ఒక షిద్దుడు తపస్సు చేసినట్లు పురాణ విదితం.ఈ చెట్టును పూజించిన వారికి సంతానం ప్రాప్తి కలుగుతుందని పలువురు నమ్ముతున్నారు.చండ్ర తిరుపెమ్ రెడ్డి వంశస్థులైన వెలుగోడు కు చెందిన డాక్టర్ శివ శంకర రెడ్డి , వారి సతీమణి సీతాలక్షమ్మ లు ఆధ్వర్యంలో అభిషేకం , శివార్చన , లక్ష దీపార్చన , కుంకుమార్చన శ్రీ రుద్రకోటేశ్వర దేవతలకు 8 తేదీ శివరాత్రి మహోత్సవం రోజు జరపబడును. మహాశివరాత్రి రోజు ఉదయం 7 గంటల నుంచి మరుసటి రోజు 7 గంటల వరకు కర్ణాటక శివస్వామి ఆధ్వర్యంలో శివనామ సంకీర్తన ఏకాహాo జరుగును. 9 తేదీ ఉదయం 9 గంటలకు శివ పార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా జరుగును. అన్నదాన కార్యక్రమం జరుగును. శివరాత్రి జాగరణ సందర్భంగా నంద్యాల శ్రీరామ డ్రెస్ కంపెనీ వారిచే సత్య హరిశ్చంద్ర , పడక సీను , మయ సభ , కర్ణ రహస్యం , భవాని సీను మొదలగు పౌరాణిక నాటికలు ప్రదర్శిస్తారని , బోయరేవుల గ్రామ సుంకుల పరమేశ్వరి భజన మండలి వారిచే భజనలు , ఎర్రగుడూరు , శాంతినిలయం వారిచే ప్రభలు విద్యుత్ దీపాలంకరణ తో తీసుకు వస్తారని ఆలయ ధర్మకర్త తెలిపారు.ఈ క్షేత్రానికి నంద్యాల ,ఆత్మకూరు , వెలుగోడు గ్రామాల నుంచి ఆర్టీసీ వారు భక్తులకు బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు.