PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యక్తిత్వ వికాసం పై పుస్తకాన్ని రచించడం అభినందనీయం

1 min read

నిచ్చన మెట్ల శేషఫణిశర్మ రచించిన పిల్లల కోసం మీకోసం కూడా పుస్తకాన్ని ఆవిష్కరించిన సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ.

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రామాయణం మహాభారతం భాగవతం లాంటి పరమ పవిత్రమైన గ్రంథాలను మూలంగా చేసుకొని వ్యక్తిత్వ వికాసం పై పుస్తకాన్ని రచించడం అభినందనీయమని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు నిచ్చెనమెట్ల శేషఫణిశర్మ రచించిన  పిల్లల కోసం.. మీకోసం కూడా.. పుస్తకాన్ని ఆయన విశిష్ట అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ రోజువారి జీవితంలో  బాధలలో ఉన్న వారికి, డిప్రెషన్ లో ఉన్నవారికి ఈ పుస్తకం చదవడం వరం లాంటిదని చెప్పారు .ఒక విధంగా చెప్పాలంటే బాధలు డిప్రెషన్ లో ఉన్నవారికి మానసిక వైద్యులు మందులు రాసి ఇవ్వడం కంటే ఇలాంటి పుస్తకాలు చదవమని సూచించడం ఎంతో మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ పుస్తకంలో రామాయణ, మహాభారతం ,భాగవతంతో పాటు వేమన సుమతీ శతకం, అల్లాసాని పెద్దన ,నన్నయ వంటి కవుల రచనలను కూడా స్పృశించారని చెప్పారు .ఒక మనిషిలో నెగిటివ్ ఆలోచనలు ఉంటే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి… అదే పాజిటివ్ ఆలోచనలతో ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది అనే అంశాలను ఈ పుస్తకంలో విపులంగా చర్చించారని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే నిచ్చెనమెట్ల శేష పని శర్మను పీహెచ్డీ చేసే దానికి ఒక టాపిక్ గా కూడా తీసుకోవచ్చని అన్నారు. తాను పాఠశాల విద్య వరకే తెలుగులో చదువుకున్నానని, 1976 లో ఎంబిబిఎస్ లో చేరిన తర్వాత తెలుగుతో అనుబంధం లేకుండా పోయిందన్నారు .ఈ కాలంలో కూడా తమ స్వగ్రామం కరివేన కు చెందిన నిచ్చెన మెట్ల శేషఫణి శర్మ లాంటి తెలుగుపై అద్భుతమైన పట్టు ఉన్న వ్యక్తులు ఉండటం తమ గ్రామ అదృష్టంగా భావిస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ మనసును నియంత్రణలో ఉంచుకుంటే ఆనందంగా జీవించవచ్చని, మనసును నియంత్ర నియంత్రణలో ఉంచుకోలేని వారు అల్ల కల్లోలమైన జీవనం సాగిస్తారని వివరించారు .ఈ పుస్తకాన్ని తాను పరిశీలించానని, తన వంతుగా 50 పుస్తకాలను స్పాన్సర్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పుస్తకాలను సద్వినియోగం చేసుకునే వారికి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రవీంద్రా విద్యాసంస్థల అధినేత పుల్లయ్య ,డాక్టర్ వెంకట కృష్ణ, రామాయణం చలపతి తదితరులు పాల్గొన్నారు.

About Author