NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మ‌హిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేసిన అధికారులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ లోని ఓ మ‌హిళా క్రికెటర్ ఇల్లు కూల్చివేత అంశం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తుకారంగేట్ లో శుక్రవారం ఉదయం జీహెచ్‌ఎంసీ అధికారులు మహిళల రంజీ జట్టు క్రికెటర్‌ భోగి శ్రావణి ఇల్లును కూల్చివేశారు. కాగా, ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని గతంలో ఆమె కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే తాము ఇంటికి మరమ్మత్తులు చేసినట్టు క్రికెట‌ర్ శ్రావ‌ణి తెలిపారు. అదేమీ పట్టించుకోకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈరోజు.. తమ ఇంటికి వచ్చి వస్తువులు బయటపడేసి ఇంటిని కూల్చివేశారని కన్నీటిపర్యంతమయ్యారు. కాగా, ఈ నెల 15వ తేదీ నుంచి జరిగే మహిళల టీ20 సిరీస్‌లో పాల్గొనాల్సి ఉందన్న శ్రావణి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్‌ ఆడాలా..? లేక ఇంటి కోసం పోరాడాలా..? అని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే, శ్రావణి ఇండియా తరఫున మ్యాచ్‌లను ఆడుతోంది.

                                     

About Author