తుంగభద్ర డ్యామ్ కి అధికారులు నీటిని అందించాలి…కోట్ల సుజాతమ్మ
1 min readపల్లెవెలుగు వెబ్ ఆలూరు: తెలుగుదేశం పార్టీ ఇంచార్జి, మాజీ MLA గౌ.శ్రీమతి కోట్ల సుజాతమ్మ గారి ఆధర్యంలో ఆంధ్ర+కర్ణాటక రెండు రాష్ట్రాల ప్రజల జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో నీరు రోజురోజుకు తగ్గిపోతున్న నేపత్యంలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు పంటలు లేక ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడకూడదని. అలాగే మన రాష్ట్రంలో తుంగభద్ర పరివాహక ప్రాంత ప్రజలకు, రైతులకు త్రాగు మరియు సాగునీటి కోసం చాలా కష్టమవుతుందని.ఈరోజు శ్రీమతి సుజాతమ్మ ,రైతులతో కలసి కర్ణాటక లోని తుంగభద్ర డ్యామ్ ను సందర్శించి తుంగభద్ర డ్యామ్ అధికారులు సెక్రెటరీ,SE,JE లను కలసి ప్రజల సమస్యలను వివరించి మెమోరాండం ఇవ్వడం జరిగింది.శ్రీమతి సుజాతమ్మ అభ్యర్థన మేరకు అధికారులు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ప్రజలకు త్రాగు, రైతులకు ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఇబ్బంది లేకుండా నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడున్న రైతులందరూ చప్పట్లతో శంతోషం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో ఆలూరు నియోజకవర్గ మరియు తుంగభద్ర పరివాహక ప్రాంత ఆంధ్ర రైతులు,TDP నాయకులు కార్యకర్తలు, ఆయా గ్రామాల ప్రజలు , ఆలూరు తాలూకా TDP వివిధ మండలాల సీనియర్ నాయకులు,కార్యకర్తలు ప్రస్తుత TDP, MPTC సర్పంచులు మాజీ ఎంపిటిసిలు మాజీ సర్పంచులు అలాగే ప్రస్తుతం వివిధ హోదాలో ఉన్న TDP నాయకులు TDP అనుబంధ సంఘాలు నాయకులు, నందమూరి,నారా,కోట్ల అభిమానులు,యూత్ సంఘాల నాయకులు అందరూ పెద్దఎత్తున పాల్గొనడం జరిగింది.