PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జీవనోపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలి

1 min read

– జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు : ఆదోని ప్రాంతం నుండి వలసలు వెళ్లకుండా, ఇక్కడే జీవనోపాధి కల్పించేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు ఆదేశించారు. శనివారం ఆదోని మునిసిపల్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ లతో కలిసి అన్ని శాఖల జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు.. ఈ సందర్భంగా ఆదోని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల ను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా అధికారులకు వివరించారు .ఆదోని ప్రాంతంలో అక్షరాస్యతా శాతం 51.39 ఉందని, 70 సంవత్సరాల తర్వాత కూడా ఇంత తక్కువ అక్షరాస్యత ఉండడం విచారించాల్సిన అంశం అని కలెక్టర్ పేర్కొన్నారు. అందువల్ల విద్యా శాఖ కీలక పాత్ర పోషించాలన్నారు.. అదే విధంగా సంక్షేమ శాఖల అధికారులు కూడా ఈ అంశంలో శ్రద్ధ తీసుకోవాలన్నారు.ఈ ప్రాంతంలో ఉన్న అన్ని పాఠశాలలను నాడు నేడు పథకం కింద చేర్చి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అదేవిధంగా పిల్లలు రెండు రోజులు పాఠశాలకు రాలేదంటే ఎందుకు రాలేదు అనే వివరాలను తెలుసుకోవాల్సిన బాధ్యత హెడ్మాస్టర్లు, హాస్టల్ సంక్షేమ అధికారులపై ఉందన్నారు. పిల్లలను వలసలు పంపించకుండా పాఠశాలల్లో మంచి విద్య లభిస్తుందన్న నమ్మకం తల్లిదండ్రులు కల్పించాలని కలెక్టర్ సూచించారు.అదే విధంగా ఇక్కడివారు వైద్యం కోసం బయటికి వెళ్లకుండా ప్రతి అర్బన్ హెల్త్ సెంటర్, పీహెచ్సీ, సిహెచ్సి, ఏరియా ఆసుపత్రులు అన్నీ వంద శాతం నాడు – నేడు కింద చేర్చేలా ప్రతిపాదనలు పంపుతున్నామని కలెక్టర్ తెలిపారు.పంట సాగు విస్తీర్ణం 433193 హెక్టార్ లు ఉండగా, ఇందులో ఇరిగేటెడ్ 56467 హెక్టార్లు ఉందని, 376726 హెక్టార్ల విస్తీర్ణం లో నీటిపారుదల కావడం లేదన్నారు..అందువల్ల ఈ ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై కూడా దృష్టి పెట్టాల్సి న అవసరం ఉందన్నారు.డ్రిప్ ఇరిగేషన్, టమోటా తో పాటు ఇతర అగ్రీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు, మిల్చింగ్ animals, గొర్రెల పెంపకం, పరిశ్రమల ఏర్పాటు, జల జీవన్ మిషన్ అమలు, విద్యా రంగం అభివృద్ధి, గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పనుల కల్పన, గరిష్ట కూలీ అందించడం తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ఇందుకు సంబంధించి తీసుకోవలసిన చర్యలపై సమగ్ర నివేదిక అందచేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు..ప్రధానంగా అక్టోబర్, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో గుంటూరు బెంగళూరు హైదరాబాదుకు వలసలు ఎక్కువగా వెళ్తున్నారని, పత్తి,మిరప పంటల కోతకు, నిర్మాణ పనులకు వెళ్ళడం జరుగుతోందన్నారు.. ఏప్రిల్,మే నెలల్లో మళ్లీ తిరిగి వస్తున్నారన్నారు.. ఈ సీజన్లో వలసలు వెళ్లకుండా ఉండడానికి అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ అంశాలపై అన్ని శాఖల అధికారులు వచ్చే బుధవారం లోపు రెండు పేజీల నోటును డ్వామా పిడి, సిపిఓ లకు పంపించాలని, వీటిని క్రోడీకరించి సమగ్ర నివేదిక ఇవ్వాలని డ్వామా పిడి, సిపిఓ లను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ రెడ్డి కాంత్ రెడ్డి డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, irrigation SE రెడ్డి శేఖర్ రెడ్డి, సిపిఓ అప్పలకొండ, డీఈవో రంగారెడ్డి SSA పిఓ వేణుగోపాల్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

About Author