NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ ఆటిజం’ … పెరుగుతోందా…!

1 min read

Wolrd Autism Awareness Day - Autism Awareness ribbon sign and text on dark blue puzzle texture background vector design

పిల్లలు మాట్లాడకపోవడం.. గుంపులో కలవకపోవడం…అధిక ఉత్సాహం ప్రదర్శించడం…

  • మూడేళ్లలోపు ‘ ఆటిజం ’ గుర్తిస్తే… నయమయ్యే అవకాశం..
  • ప్రవర్తన చికిత్స( బిహేవియర్​ థెరపి)తో కంట్రోల్​…
  • జాగ్రత్త పడాలని పిల్లల తల్లిదండ్రులకు సూచిస్తున్న చిన్న పిల్లల  వైద్య నిపుణులు
  •  ఏప్రిల్ 2న అంతర్జాతీయ ఆటిజం దినోత్సవం

పిల్లలు మాట్లాడటంలో ఇబ్బంది, స్నేహితులను కలిగి ఉండలేకపోవడం, గుంపులో ఆటలలో పాల్గొనలేకపోవడం, బొమ్మలను పంచుకోవడంలో ఆసక్తి చూపడం లేదంటే… పిల్లలపై ఆటిజం ప్రభావం అధికంగా ఉందని, మూడేళ్లలోపు ఆ లక్షణాలు గుర్తిస్తే నయం చేయవచ్చని పిల్లల వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్​ 2న అంతర్జాతీయ ఆటిజం దినోత్సవం సందర్భంగా వైద్యులు పిల్లల తల్లిదండ్రులకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.

కర్నూలు, న్యూస్​ నేడు : వయస్సుకు తగ్గట్టు మానసిక పరమైన ఎదుగుదల లేకపోవడం… స్నేహితులతో  ఆట ఆడకపోవడం.. అత్యుత్సాహం ( హైపర్​ యాక్టివిటి) ఉండటం తదితర లక్షణాలు ఉన్న పిల్లలను వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు చిల్ర్డన్స్​ న్యూరాలజిస్ట్​, సైకియాజిస్ట్ లు. పిల్లలు ప్రత్యేక థెరపీ, ప్రవర్తన థెరపీతో నయం చేయవచ్చని వెల్లడించారు.

30 మందిలో ఒకరికి…

గత 15 సంవత్సరాల్లో ఆటిజం ప్రాబల్యత పెరుగుతోంది. 15 ఏళ్ల క్రితం ప్రతి 150 మంది పిల్లల్లో 1 మందికి అటిజం కనిపించేది. ప్రస్తుతం ప్రతి 30 మంది పిల్లల్లో 1 మందికి ఈ వ్యాధి ఉన్నట్లు గుర్తిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు ప్రజల్లో పెరుగుతున్న అవగాహన, అంగీకారం, మరియు బాల వికాస కేంద్రాల అందుబాటులో పెరుగుదల.

జన్యుపరంగా… కొంత…  

ఇప్పటికీ స్పష్టమైన కారణం తెలియదు. అయితే కొన్ని కారణాలు అటిజానికి దారితీసే అవకాశం ఉంది. జన్యుపరమైన పరిస్థితులు,  మారుతున్న పర్యావరణ పరిస్థితులు, మూర్చ వ్యాధి (ఎపిలెప్సీ), ముందస్తు ప్రసవం (ప్రీమ్యాచురిటీ), గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల అధిక వయస్సు, అటిజంతో సంబంధం ఉన్న ఇతర సమస్యలు, 20% పిల్లలకు మూర్చ (సీజర్స్) వచ్చే అవకాశం, నిద్ర సమస్యలు, ఆగ్రహపుటావేశం, అధిక ఉత్సాహం (హైపర్ యాక్టివిటీ), మానసిక మూడ్ డిసార్డర్స్, ఆందోళన (యాంగ్జైటీ)

మానసిక ఎదుగుదలపై సందేహమొస్తే..

అతన్ని సమగ్ర బాల వికాస కేంద్రానికి తీసుకెళ్లాలి. అక్కడ అభివృద్ధి చెందిన నిపుణుల బృందం పరిశీలిస్తారు: అభివృద్ధి శిశువైద్య నిపుణులు (డెవలపమెంటల్ పీడియాట్రిషన్), బాల నాడీ వైద్యులు (పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్), శారీరక థెరపిస్ట్ (ఆక్యుపేషనల్ థెరపిస్ట్), క్లినికల్ సైకాలజిస్ట్, మాటల అభివృద్ధి నిపుణులు (స్పీచ్ థెరపిస్ట్), అంతేకాక, అవసరమైతే MRI స్కాన్, మెటబాలిక్ టెస్టింగ్, జన్యుపరమైన పరీక్షలు సూచించబడతాయి.

అటిజానికి చికిత్స ఏమిటి?

ప్రాథమికంగా ప్రవర్తనా చికిత్స (Behaviour Therapy) అనుసరించాలి., 50% పిల్లలకు సంబంధిత ప్రవర్తనా సమస్యల నియంత్రణ కోసం మందులు అవసరం అవుతాయి., తల్లిదండ్రుల శిక్షణా కార్యక్రమాలు ముఖ్యమైన భాగం. వారానికి 30-40 గంటల తల్లిదండ్రుల సహాయం చికిత్సలో కీలకం.

బిహేవియర్​ థెరపి ఇవ్వాలి..

ఆటిజం అనేది వ్యాధి కాదు. కొందరి పిల్లల్లో మొదటి సంవత్సరం నుంచే  ఆటిజం లక్షణాలు కనిపిస్తాయి. ఐదేళ్ల లోపు అధికమయ్యే అవకాశం ఉంటుంది. మూడేళ్లలోపు గుర్తిస్తే.. త్వరగా నయమయ్యే అవకాశం ఉంది. అటువంటి సమస్య ఉన్న పిల్లలు కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో  స్పీచ్​ థెరపీ, బి హేవియర్​ (ప్రవర్తన) థెరపీ ఇస్తారు. ఇందుకు పిల్లల తల్లిదండ్రులు పూర్తిగా సహకరించాలి.

  • డా.పి. రవింద్ర నాథ్​ రెడ్డి,  అసోసియేట్​ ప్రొఫెసర్​, జీజీహెచ్​, కర్నూలు.

 టి.వి., సెల్​ ఫోన్లకు దూరం పెట్టండి

 ఆటిజం అనబడే మానసిక రుగ్మత గల పిల్లలు టివి, సెల్​ ఫోన్ల కు దూరంగా పెట్టాలి. పిల్లలతో తల్లిదండ్రులు అధిక సమయం కేటాయించాలి.  ఒంటరి తనం కోరుకునే ఈ పిల్లలను తాము ఆడుకునే వస్తువులను తీసుకొన్నా… వారున్న ప్రదేశం నుంచి వేరే చోటుకు మార్చినా విపరీతంగా ఏడుస్తారు. మొండిగా ప్రవర్తిస్తారు.   ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలకు ఫిజియో థెరపీ, ఫ్యామిలీ కౌన్సిలింగ్​,  స్పీచ్​ థెరపీ తో   నియంత్రించవచ్చు.

 డా. రమేష్​ బాబు,ప్రముఖ సైకియాట్రిక్​, మానస క్లినిక్​ అధినేత, కర్నూలు.

త్వరగా గుర్తించాలి

 ఆటిజం లక్షణాలున్న పిల్లలను మూడేళ్లలోపు గుర్తించాలి. పిల్లల మానసిక ఎదుగదల,  ఆట, ఇతరులతో మాట్లాడటం తదితరవి ఎప్పటిప్పుడు తల్లిదండ్రులు గమనించాలి. ఆటిజం లక్షణాలు ఉన్న పిల్లలను తల్లిదండ్రులు దగ్గరలోని  చిల్ర్డన్స్​ న్యూరాలజిస్ట్​ దగ్గర చికిత్స చేయించుకోవాలి.

  • డా. శ్వేతా రాంపల్లి , కన్సల్టెంట్ పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్, కిమ్స్ కడిల్స్, కర్నూలు

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *