PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆటో మిత్రులు.. సహకరించాలి : ఎస్ ఐ రమేష్ బాబు

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి : రాయచోటి పట్టణ పరిధిలోని అటో డ్రైవర్లు ప్రతిఒక్కరూ పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ బాబు పేర్కొన్నారు. మంగళవారం నేతాజీ సర్కిల్ సమీపంలో ఆటో డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు    శివాలయం వద్ద, ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద, నేతాజీ సర్కిల్ వద్ద ఆటోస్టాండ్లు ఏర్పాటు చేసినట్లుఆయన తెలిపారు. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఆటో స్టాండ్ల ఏర్పాటుకుకృషి చేస్తానన్నారు. ఆటో డ్రైవర్స్ మరియు యజమానులు ఈ క్రింద తెలిపిన సూచనలను ప్రతిఒక్కరూ తప్పక పాటించాలి  

1. నేతాజీ సర్కిల్ వద్ద బస్ స్టాప్ నందు బస్ లకి అడ్డం గా ఆటో లను ఆపుతూ, దూర ప్రాంత బస్సు ప్రయాణికులకు మరియు ఆర్టీసి బస్ లకు ఇబ్బంది కలిగించరాదు.

2. ఆర్టీసీ బస్ స్టాండ్ లోని పూల మార్కెట్ వద్ద మరియు లక్ష్మి స్వీట్స్ వద్ద కొ ఆటోలను నిలిపి  పాదచారుల కి, కారు, ఆర్టీసీ  మరియు ఇతర వాహన దారులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు. అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. { పలుప్రాంతాలలో ఆటో స్టాండ్ తాత్కాలికంగా ఏర్పాటు చేసి ఉన్నప్పటికీ }

 4.గాలివీడు రోడ్ నందు హాస్పిటల్ వీధి లో ఆటోల నుండి ప్రయాణికులను దింపిన తరువాత “వన్ వే” నియమాలకు విరుద్ధంగా ఆటో లను వెనుకకి తిప్పి తిరిగి గాలివీడు బస్ స్టాండ్ వైపునకు వస్తూ ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తూ ఉన్నారు. ఇది సరైన పద్దతి కాదన్నారు..

5. రాత్రి సమయాల్లో అత్యధిక బాడుగలను అడుగుతూ ఉన్నట్టు మరియు ప్రయాణికుల తో అడిగినంత ఇవ్వలేదు అని దురుసు గా ప్రవర్తిస్తూ ఉన్నట్టు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ప్రజలకి ఇబ్బంది కరమైన ఏ చిన్న పొరబాటు ను కూడా మీ రాయచోటి ట్రాఫిక్ పోలీస్ వారు తీవ్రంగా పరిగణిస్తారు అని గుర్తుపెట్టుకోవాలన్నారు.

 6 ఆటో స్టాండ్ ల వద్ద డ్రైవర్ల ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండాలి.

7 లైసెన్స్ లేని వారు ఆటో లను నడుప రాదు.

8  విపరీతమైన సౌండ్ వచ్చే విధంగా కొన్ని ఆటో లలో మ్యూజిక్ సిస్టం లను బిగించి ఉన్నారు వాటిని తొలగించాలన్నారు. రాయచోటి ఆటో డ్రైవర్లు అందరు ఈ విషయాలను దృష్టి లో ఉంచుకొని తమ తమ ఆటో లను నడపాలని తెలిపారు. అలా. సూచనలు పాటించని వారిపై చట్టపరమైన కటిన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author